మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కృతీశెట్టి

మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కృతీశెట్టి

మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో కన్ను మూసి తెరిచేలోగా ఫుల్ బిజీ అయిపోయింది కృతీశెట్టి. ఈ యేడు ఇప్పటికే ఆమె నటించిన నాలుగు సినిమాలు రిలీజయ్యాయంటే ఏ స్పీడులో దూసుకెళ్తోందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు తీస్తున్న తమిళ, తెలుగు బైలింగ్వల్‌‌తో పాటు మరో తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. ఇప్పుడు మాలీవుడ్ ఎంట్రీకి కూడా రెడీ అయ్యింది. టోవినో థామస్ హీరోగా ‘అజయంతే రందమ్ మోషణమ్’ అనే మలయాళ సినిమా రాబోతోంది. జితిన్ లాల్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

మూడు యుగాల కథాంశంతో త్రీడీ ఫార్మాట్‌‌లో, ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని నిన్న పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కలరి ఆర్ట్ నేపథ్యంలో నడిచే స్టోరీ ఇది. టోవినో తొలిసారి ట్రిపుల్ రోల్ చేయబోతున్నాడు. కలరిలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. అతని సరసన కృతీశెట్టి హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా చాలెంజింగ్‌‌గా ఉండబోతోందని చెబుతున్నారు. తనతో పాటు ఐశ్వర్యా రాజేష్, సురభిలక్ష్మి కూడా ఫిమేల్ లీడ్స్‌‌గా కనిపించనున్నారు. మొత్తానికి తెలుగులో స్పీడందుకుని, తమిళంలో బిజీ అయ్యి, ఇప్పడు మలయాళ సీమలోనూ ఎంటరవుతోంది కృతి. ఇంకా ముందు ముందు ఏ స్థాయికి వెళ్తుందో చూడాల్సిందే!