భారత ఇతిహాసాల్లోనే అత్యంత గౌరవించదగిన గొప్ప మహిళా సాథ్వి సీత దేవి. ప్రస్తుతం ఆదిపురుష్ తో ప్రభాస్, కృతి సనన్ జంటగా రామాయణ గాథను తెరకెక్కించాడు దర్శకుడు ఓం రౌత్. సీతా నవమి సందర్బంగా.. ఈ సినిమా నుండి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. అంకితభావం, నిస్వార్థత, శౌర్యం, స్వచ్ఛతకు ప్రతిరూపం జానకి. కృతి సనన్ నటించిన జానకి పాత్రను మంత్రముగ్ధమైన రూపంతో ఉన్న మోషన్ పోస్టర్ తో పాటు.. 'రామ్ సియా రామ్' ఆడియో టీజర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్.
జానకి పాత్రలో కృతి సనన్ స్వచ్ఛత, దైవత్వం మరియు ధైర్యాన్ని రాఘవ్ భార్యగా సూచిస్తుంది. రాం సియా రామ్ ట్యూన్ జానకికి రాఘవ పట్ల ఉన్న అచంచలమైన భక్తిని తెలియజేసేలా ఉంది. ఈ పాట ప్రేక్షకులను ఆధ్యాత్మికత, భక్తి ప్రపంచానికి తీసుకువెళుతుంది. ఈ గీతాన్ని సచేత్–పరంపర స్వరపరిచారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్‌ను టి-సిరీస్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా వంశి నిర్మిస్తున్నాయి.16 జూన్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.