
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులే ఆదిపురుష్ సినిమా ఒకటి. రామాయణ గాద ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om routh) తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా, కృతి సనన్(Krithi sanon) సీత పాత్రలో నటిస్తోంది. దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకేకకితున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆంచనాలున్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన ఫోటోస్ కి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక తాజాగా సీత నవమి సందర్భంగా ఈ చిత్రం నుండి సీత లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఇమేజెస్ కి సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అశోక వనంలో శ్రీరాముడి కోసం ఎదురుచూస్తున్న సీతగా కనిపిస్తున్న కృతి సనన్ ఫస్ట్ లుక్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. సీత పాత్రకి కృతినే పర్ఫెక్ట్ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఫోటోసే ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు.. కొంతమంది సీత లుక్ ని రీ క్రియేట్ చేస్తూ వీడియోస్ కూడా చేస్తున్నారు.
ఇక తాజాగా ఒక అభిమాని కృతి సనన్ సీత ఫోటోని పెయింటింగ్ వేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అచ్చం ఫస్ట్ లుక్ పోస్టర్ లానే పాయింట్ చేసిన ఈ వీడియొ ప్రస్తుతం నెట్టినట వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోకి ఈ పెయింటింగ్ అద్బుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.