KritiSanon: యంగ్ హీరోతో.. పెళ్ళికి రెడీ అంటోన్న స్టార్ హీరోయిన్!

KritiSanon: యంగ్ హీరోతో.. పెళ్ళికి రెడీ అంటోన్న స్టార్ హీరోయిన్!

బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ (Kriti Sanon) అంటే కుర్రకారుకు పిచ్చిక్రేజ్. రెబల్ స్టార్ ప్రభాస్తో జోడీగా ఆదిపురుష్ సినిమాలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ మూవీలో తన సహజ నటనతో మంచి మార్కులే సొంతం చేసుకుంది.

రీసెంట్గా వచ్చిన దో పత్తీ మూవీతో ఆడియన్స్ను కృతి అలరించింది. అయితే తాజా అప్డేట్స్ ప్రకారం కృతిసనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ (Kartik Aryan)తో ఆమె డేటింగ్ లో ఉందని రూమర్స్ వినిపిస్తోన్నాయి. అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. 

ఇక వీరి రిలేషన్ షిప్పై హీరో కార్తిక్ ఆర్యన్ స్పందించాడు. "నేను సింగిల్, ఎవరికీ లైవ్ లొకేషన్ పంపాల్సిన అవసరం లేదు. అని చెప్పుకొచ్చాడు. అలాగే కృతిసనన్ కూడా డేటింగ్ పై స్పందించింది. ప్రస్తుతం తాను ఏ డేటింగ్లో లేనని.. షూటింగ్లో బిజీగా ఉన్నానని తెలిపింది.

పదేళ్ల క్రితం మహేష్ బాబు సినిమా ‘వన్ నేనొక్కడినే’తో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా పరిచయం అయిన కృతి సనన్‌‌‌‌‌‌‌‌... ప్రస్తుతం బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో మోస్ట్‌‌‌‌‌‌‌‌ వాంటెడ్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌తో దూసుకెళ్తోంది.

దో పత్తి::

అక్టోబర్ 25న నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చిన మూవీ దో పత్తి (Do Patti). అంటే పేకాటలో కనిపించే రెండు కార్డులు. కృతి సనన్ డ్యుయల్ రోల్లో నటించిన సినిమా ఇది.శశాంక్ చతుర్వేది డైరెక్ట్ చేసిన ఈ దో పత్తి మూవీ ఓ రొమాంటిక్ థ్రిల్లర్. గృహ హింస అనే కాన్సెప్ట్ ను తీసుకొని దానికి భిన్నమైన స్టోరీ లైన్తో ప్రేక్షకులకు చెప్పిన విధానం బాగుంది. అందుకే ఈ సినిమాను ఓటీటీ ఆడియెన్స్ టాప్ ట్రెండింగ్ లోకి  దూసుకెళ్లేలా చేశారు.