గత ఏడాది బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకున్న కృతి సనన్.. తాజాగా ఓ ఎక్సైటింగ్ అనౌన్స్‌మెంట్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. కోలీవుడ్ స్టార్ ధనుష్‌కు జంటగా ఓ హిందీ చిత్రంలో ఆమె నటిస్తోంది. ‘తేరే ఇష్క్ మే’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. గతంలో ధనుష్‌కు ‘రాంఝానా’ లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఆనంద్ ఎల్ రాయ్ దీనికి దర్శకుడు. మంగళవారం ఇందులో హీరోయిన్గా కృతి సనన్ నటిస్తోందని అనౌన్స్ చేయడంతో పాటు తన క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.
అల్లర్లు జరుగుతున్న ఓ ప్రాంతంలోకి పెట్రోల్ క్యాన్‌తో వెళుతుంది కృతి. పెట్రోల్‌ను తన శరీరంపై పోసుకుని స్టైల్‌గా లైటర్‌తో సిగరెట్ వెలిగించుకుంటుంది. సీన్ కట్ చేస్తే చుట్టూ అలుముకున్న మంటలు. అంతకుముందు రోజు విడుదల చేసిన వీడియోలో మండుతున్న పెట్రోల్ బాటిల్ విసిరేసి విధ్వంసం సృష్టిస్తూ కనిపించాడు ధనుష్. ‘కొన్ని సోల్స్ ఢీకొనడానికే ఉంటాయి. కొన్ని ప్రేమకథలు మండుతూ మరింత ప్రకాశిస్తాయి..’ అనే అర్థం వచ్చేలా ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి రెండు బలమైన పాత్రలతో మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఆనంద్ ఎల్ రాయ్ తీస్తున్నట్టు అర్థమవుతోంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కానుంది.