పాపం కృతీ.. ఆ ఒక్క సినిమాపైనే ఆశలన్నీ

సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంత కష్టపడాలో.. వాటిని నిలబెట్టుకోవడం కోసం అంతకన్నా ఎక్కువ కష్టపడాలి. లేకపోతే అది మూన్నాళ్ళ ముచ్చట అవుతుంది. ప్రస్తుతం ఉప్పెన(Uppena) బ్యూటీ కృతి శెట్టి(Krithi shetty) పరిస్థితి అలాగే మారింది. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సక్సెస్ తో సౌత్ సినిమా మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది ఈ బ్యూటీ. ఒక్క హిట్టుతో ఓవర్ నైట్ స్టార్  హీరోయిన్ గా మారిపోయింది.  

టాలీవుడ్ లో వరుస అవకాశాలు కూడా దక్కించుకుంది. అయితే కృతి శెట్టికి కాలం కలిసి రాలేదు. ఉప్పెన తరువాత వచ్చిన ఒక్కటంటే.. ఒక్క సినిమా కూడా ఆమెకు సక్సెస్ ఇవ్వలేదు. నాని(Nani) హీరోగా వచ్చిన శ్యామ్ సింగా రాయ్(Shyam singha rai), నితిన్(Nithin) మాచర్ల నియోజకవర్గం(Macharla Niyojakavargam), రామ్ పోతినేని(Ram pothineni) వారియర్(Warrior), నాగ చైతన్య(Naga chaitanya) కస్టడీ(Custody) ఇలా అన్ని సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచాయి. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడంలేదు కృతీ. 

ప్రస్తుతం కృతీ చేతిలో ఒకే ఒక్క  తమిళ సినిమా ఉంది. కార్తీ(Karthi) హీరోగా చేస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తుండగా.. నలన్‌ కుమారసామి(Nalan kumaraswami) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపైనే కృతీ చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు లో వాద్ధియారే అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కనీసం ఈ సినిమా అయినా కృతికి హిట్ ఇస్తుందా లేదా అని చూడాలి.