మార్చ్ 7న వెయ్యి మందితో జానపద నృత్యం

మార్చ్  7న వెయ్యి మందితో జానపద నృత్యం
  • క్రివి ఇషా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహణ 

ఖైరతాబాద్, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రివి ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న 1000 మంది బాలికలు, యువతులతో ‘జానపద నృత్య ప్రదర్శన’ నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు కె.వేదకీర్తి తెలిపారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని కస్తూర్బా గాంధీ పీజీ కాలేజీలో శుక్రవారం ఉదయం 8 నుంచి10 గంటల వరకు నృత్య ప్రదర్శన కొనసాగుతుందన్నారు. 

పదేండ్ల బాలికల నుంచి 20 ఏండ్ల లోపు యువతులు పాల్గొంటారన్నారు. ‘సేవ్​ది గర్ల్​చైల్డ్’ పేరుతో బాలికల హక్కులు, సాధికారత, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూనే లిమ్కా బుక్​ఆఫ్​వరల్డ్​రికార్డు, హైరేంజ్ బుక్ ఆఫ్​వరల్డ్​రికార్డు కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో వేదికీర్తి నృత్యప్రదర్శన పోస్టర్లను ఆవిష్కరించి.. వివరాలు వెల్లడించారు.