
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ను గురువారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ అకుల్ జైన్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ లోని విజయ విహార్ చేరుకున్న ఆయనకు స్థానిక ఇరిగేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించి బుద్ధ చరిత వనంలోని బుద్ధుని పాదాల వద్ద పు ష్పాంజలి ఘటించారు. బుద్ధవనంలో ఈవో శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర బుద్ధవనం విశేషాలను వారికి వివరించారు. అనంతరం నాగార్జునకొండ మ్యూజియాన్ని, నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు.