శ్రీశైలం, సాగర్ నుంచి నీళ్ల కేటాయింపు ఇలా : ఏయే రాష్ట్రానికి ఎంతెంత అంటే..!

శ్రీశైలం, సాగర్ నుంచి నీళ్ల కేటాయింపు ఇలా : ఏయే రాష్ట్రానికి ఎంతెంత అంటే..!

సమ్మర్ లో తెలుగు రాష్ట్రాల నీటి అవసరాల కోసం.. ముఖ్యంగా మంచినీటి కోసం శ్రీశైలం, నాగార్జున్ సాగర్ నుంచి నీటి కేటాయింపులను చేసింది KRMB ( కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్). శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో 70 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని.. రెండు రాష్ట్రాలు అత్యంత పొదుపుగా నీటిని వాడుకోవాలని సూచించింది బోర్డు. ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుని.. నీటిని విడుదల చేసుకునే విధంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులకు సూచించింది. 

నీటి కేటాయింపులు ఇలా :

  • నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి తెలంగాణకు 9 వేల క్యూసెక్కులు
  • నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రాకు 7 వేల క్యూసెక్కులు విడుదల
  • శ్రీశైలం నుంచి తెలంగాణకు 2 వేల 400 క్యూసెక్కులు విడుదల
  • శ్రీశైలం నుంచి ఏపీలోని హంద్రీనీవా, మాల్యాలకు 2 వేల 200 క్యూసెక్కుల నీటి విడుదల
  • తక్కువ నీరు ఉన్నందున నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచన
  • ఫిబ్రవరి 24వ తేదీ నాటికి రెండు ప్రాజెక్టుల్లో కలిపి 70 టీఎంపీల నీటి లభ్యత ఆధారంగా ఈ నీటి కేటాయింపులు జరిగాయి.
  • తాగునీటికి ప్రాధాన్యం ఇస్తూనే పంటలను కాపాడుకునేలా ప్రణాళికతో వెళ్లాలన్న బోర్డు