హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీకి బుధవారం నుంచి తాగునీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతినిచ్చింది. సోమవారం జరిగిన కేఆర్ఎంబీ త్రీమెంబర్కమిటీ మీటింగ్‌లో తెలంగాణకు 5.4 టీఎంసీలు, ఏపీకి 4.5 టీఎంసీల నీటిని కేటాయించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా బోర్డు మంగళవారం వాటర్ రిలీజ్ ఆర్డర్‌ను విడుదల చేసింది.
ఏపీ 5 టీఎంసీలకు ఇండెంట్పెట్టిందని, తెలంగాణ హైదరాబాద్అవసరాలు పోను పాలేరు, ఉదయ సముద్రం రిజర్వాయర్లలోకి తాగునీటి కోసం మరో 2.5 టీఎంసీలకు విజ్ఞప్తి చేశాయని బోర్డు పేర్కొంది. ‘‘ప్రస్తుతం సాగర్‌లో 4.780 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలం డ్యామ్‌లో 5.705 టీఎంసీలున్నాయి. శ్రీశైలం నుంచి అందుబాటులో ఉన్న ఆ నీళ్లను విద్యుదుత్పత్తి ద్వారా సాగర్ ప్రాజెక్ట్‌లోకి విడుదల చేయాలి. ఆ జలాల్లో 10 శాతం ఆవిరి నష్టాలు (ఎవాపరేషన్ లాసెస్) పోనూ 5.134 టీఎంసీలు సాగర్‌కు చేరొచ్చు.
మొత్తంగా శ్రీశైలం నుంచి విడుదల చేసినవి, సాగర్‌లో ఉన్నవి కలుపుకుని 9.914 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయి. అందులో ఏపీకి 4.5 టీఎంసీలు, తెలంగాణకు 5.414 టీఎంసీల నీళ్లను రిలీజ్ చేసుకోవచ్చు. రెండు ప్రాజెక్టుల్లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నీటిని కొంచెం పొదుపుగా వాడుకోవాలి. శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ద్వారా విడుదల చేసుకుంటే విద్యుదుత్పత్తిని చేసుకోవచ్చు. ఏపీ సాగర్ కుడి కాలువ ద్వారా రోజూ 5,500 క్యూసెక్కుల చొప్పున 4.50 టీఎంసీలు అయ్యేదాకా విడుదల చేసుకోవచ్చు’’ అని వాటర్ రిలీజ్ఆర్డర్లో కేఆర్ఎంబీ పేర్కొంది.