కేంద్ర జలశక్తి శాఖకు కేఆర్‌‌‌‌ఎంబీ లేఖ‌‌‌‌

  • ప్రాజెక్టుల వివరాలన్నీ పంపాము
  • మార్చి 4న తిరుపతిలో జరిగే మీటింగులో చర్చ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సదరన్‌‌‌‌ జోనల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌లో చర్చించాల్సిన ప్రాజెక్టుల వివరాలు పంపించామని కేంద్ర జలశక్తి శాఖకు కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు(కేఆర్‌‌‌‌ఎంబీ) తెలిపింది. బోర్డు మెంబర్‌‌‌‌ హరికేశ్‌‌‌‌ మీనా మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ సెక్రటరీకి లెటర్ రాశారు. తిరుపతిలో మార్చి 4న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌‌‌‌ షా అధ్యక్ష తన నిర్వహించే సమావేశంలో ఏపీ తుంగభద్రపై నిర్మిస్తోన్న గుండ్రేవుల ప్రాజెక్టు, తెలంగాణ చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌‌‌‌ స్కీంలపై చర్చించనున్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు సమాచారాన్ని నేరుగా కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ జలశక్తి శాఖ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ  చేరవేశారని తెలిపారు. తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌‌‌‌ స్కీంల ప్రస్తుత పరిస్థితిని ఈఎన్సీ మురళీధర్‌‌‌‌ తెలిపారన్నారు.  ప్రాజెక్టుల పరిస్థితిని పరిశీలించాలని లేఖలో మీనా విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి 

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీకి మస్తు నామినేషన్లు

6, 7, 8 తరగతులకు ఇయ్యాల్టి నుంచి స్కూల్స్​​ షురూ

కేసీఆర్.. ఫైళ్లు ముడ్తలే.. రివ్యూలు చేస్తలే

కార్డియాక్ అరెస్టా.. ? ఇట్ల బయటపడొచ్చు