హాలియా, వెలుగు: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యామ్ ను కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) అధికారుల బృందం గురువారం సందర్శించింది. తెలంగాణ ప్రభుత్వం డ్యామ్ కు వేసవి కాలంలో చేపట్టాల్సిన రిపేర్లను ఇటీవల ప్రారంభించింది. సాగర్‌జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న టైంలో, రిపేర్లు చేయడమేమిటని ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది.
వెంటనే రిపేర్లు నిలిపివేయాలని కోరుతూ కేఆర్ఎంబీకి లెటర్రాసింది. రిపేర్లకు కేఆర్ఎంబీ కూడా అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో కేఆర్ఎంబీ బృందం గురువారం నాగార్జున సాగర్ డ్యామ్‌ను సందర్శించి, అక్కడి పరిస్థితి సమీక్షించింది. శుక్రవారం కూడా రిపేర్లను పర్యవేక్షించనుంది.