![నీటిని పొదుపు చేయండి](https://static.v6velugu.com/uploads/2024/11/krmb-wrote-a-letter-telangana-and-andhra-pradesh--to-save-water_JjimSsHAuU.jpg)
- తెలంగాణ, ఏపీకి కేఆర్ఎంబీ లేఖ
హైదరాబాద్, వెలుగు: వచ్చే వానాకాలం వరకు నీటిని పొదుపు చేసుకోవాలని తెలంగాణ, ఏపీలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ద్వారా జలవిద్యుదుత్పత్తికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా విభజన చట్టంలో పేర్కొన్నారని, దానికి అనుగుణంగా పవర్‌హౌస్‌ల ద్వారా నీటి విడుదలను తగ్గించాలని తెలిపింది. ఈ మేరకు మంగళవారం రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. నీటిని పొదుపుగా వాడుకోవాలని, 2025 వానా కాలం వరకు ఇరిగేషన్, తాగునీటి అవసరాలకు సరిపోయేటట్టు ప్రాజెక్టుల్లో నీటి నిల్వను ఉంచుకోవాలని చెప్పింది. డ్రింకింగ్‌వాటర్, ఇరిగేషన్ అవసరాలుంటేనే పవర్‌హౌస్‌ల ద్వారా నీటిని విడుదల చేసుకోవాలని లేఖలో పేర్కొంది.