- 8 మ్యాచ్ లు ఓడిపోయామన్న బాధతో ఉంటే.. కృనాల్ ఓవరాక్షన్..!
- ఈ రియాక్షన్ నాకైతే మరీ ఓవర్‌గా అనిపించిది..!
ఐపీఎల్ ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఎంతో ఘోరంగా విఫలమవుతుందో అందరికీ తెలిసిందే. కొన్ని మ్యాచ్ లు ఈజీగా గెలుస్తామనుకున్నా దురదృష్టంతో ఓటమిపాలు కాక తప్పడంలేదు. ఇటు వంటి సమయంలో ప్రత్యర్థులు రెచ్చిపోయి ప్రవర్తిస్తే ఎలాగుంటది. అదే సీన్ ఆదివారం నాటి మ్యాచ్ లో జరిగింది. ముంబై ఇండియన్స్, లక్నో జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో ముంబైపై 36 రన్స్ తేడాతో గెలిచింది. అయితే, చివరి ఓవర్‌లో కృనాల్ పాండ్యా.. ముంబై ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌తో వ్యవహరించిన తీరు చర్చకు దారితీసింది.ఫస్ట్ లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సందర్భంగా పొలార్డ్ కృనాల్ పాండ్యాను ఔట్ చేశాడు. ఇక ముంబై లక్ష్య ఛేదనకు దిగిన క్రమంలో.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పొలార్డ్ వికెట్‌ను కృనాల్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ క్రమంలో తీవ్ర నిరాశతో క్రీజును వీడుతున్న పొలార్డ్ వీపు పైకి దుమికి కృనాల్ అతడి తలను ముద్దు పెట్టుకున్నాడు. అయితే, పొలార్డ్ ఎలాంటి స్పందనా లేకుండా భారంగా పెవిలియన్ చేరాడు. ఈ ఘటనపై మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ విమర్శించాడు. ఎదుటి వ్యక్తుల మానసిక స్థితిని అర్థం చేసుకుని వ్యవహరించాలన్నాడు. స్నేహితుడే కదా అని ఇష్టారీతిన ప్రవర్తించడం సరికాదని, ఎదుటివారి మనోభావాలను గౌరవించాలని సూచించాడు. కృనాల్, పొలార్డ్ మంచి స్నేహితులు కానీ.. ప్రత్యర్థులుగా మైదానంలో దిగినపుడు పరిస్థితులు వేరుగా ఉంటాయన్నాడు.
పొలార్డ్ పరుగులు చేయలేకపోవడంతో నిరాశలో ఉన్నాడు. ముంబై మ్యాచ్ ఓడిపోయే స్థితిలో ఉంది. అలాంటపుడు ఎవరి మానాన వారిని వదిలేయాలి. అంతగా చనువు ఉంటే.. డ్రెస్సింగ్‌రూంలో స్నేహితులతో ఏడాదంతా ఎంత సరదాగా ఉన్నా పర్లేదు కానీ.. మైదానంలో ఇలా చేయకూడదు. ఈ రియాక్షన్ నాకైతే మరీ ఓవర్‌గా అనిపిస్తోందని కృనాల్ తీరును తప్పుబట్టాడు.
మరో మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ..ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు. ఒక ఆటగాడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న స్థితిలో ఇలాంటివి చేయకపోవడం మంచిది. ఆ సమయంలో అతడి భావోద్వేగాలు, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో మనం అంచనా వేయలేం. ఒకవేళ పొలార్డ్ వెనక్కి తిరిగి సమాధానం ఇచ్చి ఉంటే ఏమయ్యేదని ప్రశ్నించాడు. తను జట్టును గెలపించలేకపోతున్నాననే నిరాశతో వెనుదిరిగినపుడు కృనాల్ ఇలా చేయడం నిజంగా టూ మచ్ అని కృనాల్ పాండ్యాపై విమర్శలు గుప్పించాడు. గతంలో పొలార్డ్, కృనాల్ ఒకే ఫ్రాంఛైజీ(ముంబై)కి ఆడిన విషయం తెలిసిందే.
— seven (@urstruly7_) April 24, 2022