CSK vs RCB: 100 కి.మీ వేగంతో బౌన్సర్లు.. ఆర్సీబీ స్పిన్నర్ ధాటికి బయపడుతున్న బ్యాటర్లు

CSK vs RCB: 100 కి.మీ వేగంతో బౌన్సర్లు.. ఆర్సీబీ స్పిన్నర్ ధాటికి బయపడుతున్న బ్యాటర్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్ క్రునాల్ పాండ్య స్టయిలే వేరు. అతను ఏ బంతిని ఎంత వేగంతో వేస్తాడో చెప్పడం కష్టం. కొన్నిసార్లు సాధారణ వేగంతో వేస్తే.. మరొకొన్ని సార్లు మాత్రమే అతని స్పీడ్ 100 దాటుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లోనూ క్రునాల్ తన బంతులతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. ఇందులో భాగంగా కొన్ని బంతులను విసిరేస్తున్నాడు. అవి ఏకంగా బౌన్స్ అవుతున్నాయి కూడా. ఈ సమయంలో ఆటగాళ్లు హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రమాదం జరగడం ఖాయంగా కనిపిస్తుంది.  

శుక్రవారం (మార్చి 28) చెపాక్ వేదికగా చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ స్పిన్నర్ క్రునాల్ పాండ్య మరోసారి తన స్పిన్ తో భయపెట్టాడు. ధోనీకి చివరి ఓవర్ లో 100 కి.మీ పైగా వేగంతో బంతిని విసరడం షాకింగ్ కు గురి చేస్తుంది. అనూహ్యంగా బౌన్స్ అయిన ఈ బంతిని ఆడడంలో ధోనీ విఫలం కాగా.. వికెట్ కీపర్ కష్టంగా అందుకున్నాడు. ఒక స్పిన్నర్ ఇంత వేగంగా బౌలింగ్ చేయడం వైరల్ గా మారుతుంది. క్రునాల్ స్పిన్ వేస్తే బ్యాటర్లు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి అనే రీతిలో బౌలింగ్ చేస్తున్నాడు.

టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో క్రునాల్ పాండ్య వేసిన బంతి వెంకటేష్ అయ్యర్ మీదకి దూసుకువచ్చింది. అయితే అదే సమయంలో అయ్యర్ హెల్మెట్ పెట్టుకోలేదు. వెంటనే రియాక్ట్ అవ్వడంతో ప్రమాదం తప్పింది. ఈ మ్యాచ్ లో తన స్పిన్ వేగంతో నాలుగు  వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. కృనాల్ బౌలింగ్ లో ఎవరైనా బ్యాటర్ ఆధిపత్యం చెలాయిస్తే అతను వేగంగా బంతిని విసిరేస్తాడు. అనూహ్యంగా వచ్చిన ఈ బంతులను ఆడడంలో చాలామంది తడబడుతుంటారు.