మిస్ వరల్డ్ గా చెక్ భామ క్రిస్టినా

ముంబై: మిస్ వరల్డ్ 2024 కిరీటం చెక్ రిపబ్లిక్ కు దక్కింది. ఆ దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. మిస్ వరల్డ్ టైటిల్ కోసం ప్రపంచవాప్తంగా 112 మంది అందాల భామలు పోటీపడ్డారు. టాప్‌-4లో క్రిస్టినా పిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), యాస్మిన్‌ అజైటౌన్‌ (లెబనాన్‌), అచే అబ్రహాంస్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టోబాగో), లీసాగో చోంబో (బోట్స్ వానా)లు నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోటీలో మిస్‌ వరల్డ్‌ కిరీటం క్రిస్టినాకు దక్కింది.