బెల్లంపల్లిలో క్షుద్రపూజల కలకలం

బెల్లంపల్లిలో క్షుద్రపూజల కలకలం
  • భయంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన కుటుంబం 

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణం లోని కన్నాలబస్తీలో మంగళవారం  క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పట్టణం లోని కన్నాలబస్తీలో మారుపాక శ్రీనివాస్ ఇంటిముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ఉదయం శ్రీనివాస్  ఇంటి తలుపు తెరిచి చూసేసరికి  ఇంటి ముందు క్షుద్ర పూజల ముగ్గు కనిపించడంతో కంగుతిన్నాడు. ఆ కుటుంబసభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. క్షుద్ర పూజలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.