ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో విజయవాడ–భద్రాచలం జాతీయ రహదారిపై క్షుద్రపూజలు కలకలం రేపాయి. రెండు రోజుల నుండి క్షుద్రపూజలు చేసిన ఒక సంచి జాతీయ రహదారిపై ఉండటంతో భయాందోళనలకు గురి అవుతున్నారు స్థానికులు. కుళ్లిన మాంసం, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కోడి గుడ్లలతో ఉన్న సంచిని ప్రధాన రహదారిపై గుర్తు తెలియని దుండగులు వదిలేశారు. ఎక్కడో పూజ చేసిన సంచి బయట పడేసే క్రమంలో జారిపడి ఉండోచ్చు అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రెండు రోజుల నుండి ఆ సంచి జాతీయ రహదారిపై ఉంది. సంచిలోని కుళ్ళిన మాంసం దుర్వాసన వస్తుండటంతో ఆ సంచి లోపల ఇంకా ఎమున్నాయో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ రహదారి మధ్యలో జన సంచారం ఉండే ప్రాంతంలో క్షుద్ర పూజలు చేసిన సంచి పడి ఉండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులు, స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.