
రెండు బొమ్మలు...రక్తపు బియ్యం..బొమ్మలకు గుచ్చిన అగర్ బత్తీలు.. అర్థరాత్రి..నడిరోడ్డుపై ప్రత్యక్షం కావడంతో ఊరు జనాలు ఉలిక్కి పడ్డారు. గ్రామంలో క్షుద్రపూజలు చేయడంతో ప్రజలంతా ఆందోళన పడ్డారు. ఎవరు చేశారు..ఎవరి కోసం చేశారన్న భయం జనాల్లో నెలకొంది. దీంతో గ్రామంలో ప్రజలు ఎవరికి ఏం జరుగుతుందో అని వణికిపోతున్నారు. ఈ ఘటన కొమరం భీం జిల్లా తిర్యాని మండలం పెర్కపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కొమరం భీం జిల్లా తిర్యాని మండలం పెర్కపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మంచెర్ల లక్ష్మి ఇంటి ముందు రక్తంతో కూడిన బియ్యాన్ని పోశారు గుర్తు తెలియని వ్యక్తులు. అందులో పిండితో చేసిన 2 బొమ్మలను ఉంచి అగర్బత్తులు వెలిగించారు.
Also Read :- నారసింహుడికి వెండి పల్లెం, మాణిక్యాలు
రోజూలాగే పొద్దున లేచిన మంచెర్ల లక్ష్మీ తన ఇంటి ముందు క్షుద్రపూజలు చేయడంతో ఆందోళన పడింది. ఎవరి కోసం చేశారు. తన కుటుంబానికి ఏమైన హాని జరుగుతుందా అని భయపడింది. అటు గ్రామస్తులు సైతం మంత్రగాళ్లు కావాలనే చేశారని చెబుతున్నారు.