కర్నాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) తన బస్సుల్లో ఒకదాన్ని మొబైల్ ఫీవర్ క్లినిక్‌గా మార్చింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో ఆస్పత్రులన్నీ బిజీగా ఉన్నాయి. దాంతో మామూలు అనారోగ్యం వస్తే రోగులను చూడటానికి ఆస్పత్రులు అందుబాటులో లేవు. దాంతో ఒక బస్సును మొబైల్ ఫీవర్ క్లినిక్‌గా మార్చారు. ఈ బస్సును బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. బస్సును మొబైల్ క్లినిక్‌గా మార్చడానికి రూ .50 వేలు ఖర్చయిందని కేఎస్ఆర్టీసీ తెలిపింది. బస్సులో ఒక బెడ్, సీటింగ్ సౌకర్యం, మెడిసిన్ బాక్స్, వాష్ బేసిన్, శానిటైజర్, సబ్బు, ఆయిల్, ప్రత్యేక నీటి సౌకర్యం, గాలికోసం ఒక ఫ్యాను మరియు మరికొన్ని అత్యవసర సదుపాయాలు ఏర్పాటు చేశారు.
కరోనా రోగులకు చికిత్స చేయడానికి KSRTC ఒక బస్సును గత వారమే మొబైల్ క్లినిక్‌గా మార్చింది. ఇది రెండవ బస్సు. దీని ద్వారా కరోనా కాకుండా మిగతా రోగాలను చూస్తామని డాక్టర్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
For More News..