డిజిటల్ పేమెంట్స్ సదుపాయం అందుబాటులో లేకపోతే చిల్లర కష్టాలు, కండక్టర్ల ఈసడింపులు ఎలా ఉంటాయో తెలియంది కాదు. ఏదో ఒక సందర్భంలో ఆర్టీసీ బస్సులో చిల్లర కష్టాలను చవిచూసే ఉంటారు. ఇకపై కర్నాటక ప్రజలకు ఆ తిప్పలు తప్పనున్నాయి. బెంగళూరులో ఉండే తెలుగు జనానికి కూడా ఇది ఊరట కలిగించే విషయమే. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది.
ఇకపై.. కర్నాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేవారు యూపీఐ పేమెంట్ చేసి టికెట్ కొనుక్కునే సదుపాయాన్ని కేఎస్ఆర్టీసీ తీసుకొచ్చింది. ఆర్టీసీ బస్సు్ల్లో క్యాష్లెస్ పేమెంట్ వెసులుబాటును కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
బెంగళూరు, మైసూరులో గత వారమే ఆర్టీసీ బస్సు్ల్లో ఈ క్యాష్లెస్ పేమెంట్స్ సదుపాయాన్ని తీసుకొచ్చారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా క్యాష్లెస్ పేమెంట్ సేవలను తీసుకొస్తున్నట్లు కేఎస్ఆర్టీసీ ప్రకటించింది. వచ్చే వారం రోజుల్లో రాష్ట్రం మొత్తం ఆర్టీసీ బస్సుల్లో యూపీఐ పేమెంట్స్ ద్వారా ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేయొచ్చని తెలిపింది.
ALSO READ | వాట్సాప్ గ్రూప్ వివాదం..ఇద్దరు కేరళ ఐఏఎస్ అధికారులు సస్పెండ్..కలెక్టర్బ్రో కూడా ఉన్నాడు
వాస్తవానికి ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషీన్స్ పదేళ్ల క్రితమే కర్నాటకలో తీసుకొచ్చారు. అయితే.. ఫోన్పే, గూగుల్పే వంటి యూపీఐ ఆధారిత పేమెంట్ సర్వీస్ యాక్సెప్ట్ చేసే టెక్నాలజీ ఆ ఈటీఎమ్స్లో లేదు. త్వరలో ఏటీఎం కార్డు ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కొనుగోలు చేసే సదుపాయాన్ని కూడా తీసుకొస్తామని కేఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అన్బు కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కొనుగోలు చేసే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా రాజధాని వంటి బస్సుల్లో యూపీఐ పేమెంట్స్ చేసి టికెట్ కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది.