కేటీపీఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

కేటీపీఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

పాల్వంచ,వెలుగు : పట్టణంలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీ ఎస్)అనుబంధంగా నూతనంగా కేటీపీఎస్ ఎస్సీ, ఎస్టీ, వడ్డెర, జనరల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక బొల్లోరు గూడెం లోని అసోసియేషన్ కార్యాలయంలో కాంట్రాక్ట ర్స్ సమా వేశమై నూతన అధ్యక్షుడిగా ధర్మసోత్ చందర్, ప్రధాన కార్య దర్శిగా వి.బాబురావు, కోశాధికారిగా బట్టు కృష్ణ, ఉపాధ్యక్షుడిగా బట్టు వీరన్న

వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొరడాల శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ గా బట్టు శంకర్, ఆర్గనైజిం గ్ సెక్రటరీగా అజ్మీర యోగి నాయ క్ ను ఎన్నుకున్నారు. సంఘ ముఖ్య సలహాదారుగా వి.సుబ్బారావు, కె.హరినారాయణను ఎన్నుకున్నారు. ఏడాదిపాటు కొనసాగే ఈ కమిటీ కాంట్రాక్టర్స్ సమస్య లపై జెన్​ కో యాజమాన్యంతో చర్చించనున్నట్లు వారు తెలిపారు.