
కేటీఆర్, హరీశ్‌రావు మాజీలవడం ఖాయం: ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ట్యాంక్ బండ్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కేటీఆర్,హరీశ్‌రావు మాజీలవడం ఖాయమని ఫిషరీస్ కార్పొరేషన్చైర్మన్మెట్టు సాయికుమార్అన్నారు. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అబద్ధాలు మాట్లాడారని, వారిని చూసి, ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి, ఓర్వలేక అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.