అల్లు అర్జున్ అరెస్ట్‎‎పై స్పందించిన కేటీఆర్, హరీష్ రావు.. ఏమన్నారంటే..?

అల్లు అర్జున్ అరెస్ట్‎‎పై స్పందించిన కేటీఆర్, హరీష్ రావు.. ఏమన్నారంటే..?

హైదరాబాద్: సంధ్య ధియేటర్ తొక్కి సలాట ఘటనలో స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం హాట్ టాపిక్‎గా మారింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయ నాయకులు, సినీ సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. తాజాగా బన్నీ అరెస్ట్‎పై బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. 

‘‘జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు..? సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే.

ALSO READ | అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు: శిక్ష ఎన్నేళ్లు పడొచ్చు ?

 రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్‎ని ఎందుకు అరెస్టులు చేయరు..?రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు..? అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలి.

ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి..? ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి..? ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి..? చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు’’ అని అల్లు అర్జున్ అరెస్ట్‎ను తీవ్రంగా ఖండించారు హరీష్ రావు. 

ALSO READ | అల్లు అర్జున్ అరెస్టు.. స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కేటీఆర్ సైతం ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘‘అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును.. చేసిన అతిని ఖండిస్తున్నాను.
జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్టు పాలకుల అభద్రతాభావానికి తార్కాణం. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది, కానీ అసలు తప్పు ఎవరిది..? నేరుగా ఆయనకు సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్‎ని సాధారణ నేరస్తుడిలా పరిగణించడం సరైంది కాదు. సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ అరెస్టు చేయడం న్యాయమైతే.. హైడ్రా పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి మరణానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి’’ అని డిమాండ్ చేశారు కేటీఆర్.