వ్యవసాయ రంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శం

వ్యవసాయ రంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శమన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో మూడు ఆధునిక జూట్ మిల్లుల ఏర్పాటుపై ఒప్పందం కార్యక్రమంలో మంత్రులు KTR, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో జూట్ పరిశ్రమకు మంచి డిమాండ్ ఉందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. .జూట్ మిల్లులతో  10 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు. పదివేల ఎకరాల్లో ఫుడ్  ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.