లండన్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం

లండన్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం

యూకే, దావోస్ పర్యటన కోసం లండన్ చేరుకున్న మంత్రి కేటీఆర్ కు ఘనస్వాగతం లభించింది. లండన్ విమానాశ్రయంలో యూకే టీఆర్ఎస్  విభాగంతో పాటు ఎన్ఆర్ఐ సంఘాలు, పలువురు మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలికారు. యూకేలో  నాలుగు రోజులపాటు పర్యటించనున్నారు కేటీఆర్. పలు కంపెనీలు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, ఇండస్ట్రియలిస్ట్ లతో సమావేశం కానున్నారు. UK బిజినెస్ కౌన్సిల్ నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలోనూ ఆయన పాల్గొంటారు. తెలంగాణ, ఏపీకి చెందిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మంత్రి కేటీఆర్ కు లండన్ లో స్వాగతం పలికారు.

 

 

ఆ తర్వాత ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న  ప్రపంచ ఆర్థికవేదిక సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. ఈ నెల 26న తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో యూకేలోని వెస్ట్‌ లండన్‌లోని పలు ప్రాంతాల్లో కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.