ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు ఎప్పుడు నిలబెట్టుకుంటారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 2023 డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారని.. రెండు నెలలు గడుస్తున్నా.. రైతుల రుణమాఫీ జరగలేదని విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను బద్నాం చేయడంపైనే కాంగ్రెస్ దృష్టి సారించిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మేడ్చల్ మల్కాజిగి జిల్లా ఘట్ కేసర్ లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
Also read :- నాగోబాకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే శ్రీరామ రక్ష.. తెలంగాణ గురించి ఎక్కడైనా గొంతెత్తి మాట్లాడే ధైర్యం కేసీఆర్ కు ఉందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. రాష్ట్ర హక్కులు సాధించాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని కేటీఆర్ కోరారు.