కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వనుందా..? నెక్స్ట్ ఏం జరగబోతోంది..?

కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వనుందా..? నెక్స్ట్ ఏం జరగబోతోంది..?

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ఆఫీసు నుంచి వెళ్లిపోవడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అడ్వకేట్లను అనుమతించకపోవడంతో ఏసీబీ అధికారులకు లేఖ ఇచ్చి కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కోర్టు తీర్పు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయాలని లేఖలో కేటీఆర్ కోరారు. కేటీఆర్ అభ్యర్థనపై ఏసీబీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇవ్వాలని ఏసీబీ నిర్ణయించినట్లు సమాచారం.

అయితే.. కేటీఆర్ తరపు అడ్వకేట్ సోమ భరత్ మాట్లాడుతూ.. మీరు లోపల కుట్ర చేయాలి అనుకోకపోతే అడ్వకేట్‌ను ఎందుకు వద్దంటున్నారని నిలదీశారు. కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉందని, ఈ జడ్జిమెంట్ వచ్చేవరకు ఓపిక పట్టి తమకు టైం ఇవ్వండని ఏసీబీ వాళ్లకు ఒక లెటర్ ఇచ్చామని కేటీఆర్ తరపు న్యాయవాది మీడియాకు వెల్లడించారు. ఈ లెటర్ ఇవ్వడానికి కలిసి వెళ్ళామని, అడ్వకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్ అని సోమ భరత్ చెప్పారు.

Also Read : ఏసీబీ ఆఫీస్కు వచ్చినట్టే వచ్చి తిరిగి వెళ్లిపోయిన కేటీఆర్ !

రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా కాలదన్నే పద్ధతుల్లో అడ్వకేట్లను తీసుకు రావద్దనడం ఏంటని పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఇటీవల కూడా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇవ్వని స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు రాసుకున్నారని, ఇవాళ(జనవరి 6, 2025) అది జరగకూడదని తాము కలిసి వెళ్ళామని చెప్పారు. అడ్వకేట్‌ను అసలు ఏసీబీ ఆఫీస్ లోపలికి ఎందుకు రానివ్వ లేదని, దాని వల్ల మీకు నష్టం ఏమిటని పోలీసులను, ఏసీబీని కేటీఆర్ తరపు న్యాయవాది సోమ భరత్ నిలదీశారు. ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. అనంతరం.. లీగల్ టీంతో కూడా చర్చించారు. ఏసీబీ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని కేటీఆర్ డిసైడ్ అయినట్లు తెలిసింది.