- హామీలు అమలు కాకపోవడంతోనే సూసైడ్స్: కేటీఆర్
- 24న ఆదిలాబాద్‌నుంచి అధ్యయన కమిటీ పని షురూ
హైదరాబాద్, వెలుగు: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. రేవంత్సర్కారు తప్పుడు నిర్ణయాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే రైతులు సూసైడ్చేసుకుంటున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ.. బుధవారం మంచిరేవులలోని నిరంజన్ రెడ్డి ఇంట్లో సమావేశమైంది. ఈ మీటింగ్‌కు కేటీఆర్హాజరయ్యారు.
కమిటీ వెనుక రాజకీయ ఉద్దేశమేమీ లేదని, ఆదిలాబాద్‌లో బ్యాంకులోనే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనతోనే కేసీఆర్ఆదేశాల మేరకు కమిటీ వేశామన్నారు. ఈ నెల 24 నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచే కమిటీ తన పని ప్రారంభిస్తుందన్నారు. రాబోయే నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లోని అన్ని వర్గాల రైతులను కలిసి రుణమాఫీ గురించి అడిగి తెలుసుకుంటామన్నారు. వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ఇచ్చారని, ఆ డిక్లరేషన్‌లోని అంశాలను నమ్మి రైతులు కాంగ్రెస్‌కు ఓటేశారని కేటీఆర్ అన్నారు. రైతుల నమ్మకాన్ని కాంగ్రెస్ వమ్ము చేసిందన్నారు. సీఎం ప్రాధాన్యం ఫార్ములా కేసు అయితే, తమ ప్రాధాన్యం ఫార్మర్ అని అన్నారు.
కేసీఆర్‌ను సీఎం చేసుకునేదాకా విరామం లేకుండా పోరాడుదాం
మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేసుకునేదాకా విరామం లేకుండా పోరాడుదామని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని గ్రామసభలతో తేలిపోయిందన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో పార్టీ సత్తుపల్లి కార్పొరేటర్లు, కార్యకర్తలతో కేటీఆర్సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఏడాదిలోనే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. భవిష్యత్ మళ్లీ బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. కాగా, పార్టీ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ను కేటీఆర్ పరామర్శించారు. గుండెపోటు రావడంతో పద్మారావుగౌడ్‌కు స్టంట్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితర నేతలతో కలిసి కేటీఆర్పద్మారావుగౌడ్ను పరామర్శించారు.