రూ. 18,500 కోట్ల విద్యుత్​ చార్జీల భారాన్ని ఆపినం : కేటీఆర్​

రూ. 18,500 కోట్ల విద్యుత్​ చార్జీల భారాన్ని ఆపినం : కేటీఆర్​
  • జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో సంబురాలు చేయండి: కేటీఆర్​

 హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేయాలనుకున్న రూ.18,500 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని ఆపామని,  బుధ, గురువారాల్లో జిల్లా, నియోజకవర్గాల్లో సంబురాలు చేయాలని బీఆర్​ఎస్​ పార్టీ శ్రేణులకు కేటీఆర్​ పిలుపునిచ్చారు.  బీఆర్ఎస్​ పదేండ్లలో ఏనాడు విద్యుత్ చార్జీలు పెంచలేదని, కాంగ్రెస్​ పార్టీ రూలింగ్​లోకి వచ్చిన పది నెలల కాలంలోనే రూ.18,500 కోట్ల విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు చేసిందని అన్నారు.

పబ్లిక్ హియరింగ్ లో ప్రధాన ప్రతిపక్షంగా పాల్గొని,  ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకించేలా ఈఆర్సీని ఒప్పించగలిగామని కేటీఆర్​ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ట్వీట్​ చేశారు. రాష్ట్ర ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సరైన పద్ధతిలో శాస్త్రీయంగా ఈఆర్సీ ముందుంచడంలో విజయం సాధించామని కేటీఆర్​ తెలిపారు.  ప్రభుత్వం భారీ విద్యుత్ చార్జీల భారం మోపకుండా ప్రజల పక్షాన నిలిచిన ఈఆర్సీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు.