హైదరాబాద్: తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కు ఈరోజు ఘనస్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి లాస్‌ఏంజిల్స్ కు చేరుకున్న కేటీఆర్ కు ఎన్‌ఆర్‌ఐలు, టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐలతో మంత్రి కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిపై వారితో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనఊరు–మనబడి’ కార్యక్రమం గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్‌ఆర్‌ఐలకు పిలుపునిచ్చారు. అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ వాసులు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు.
మరిన్ని వార్తల కోసం: