రాంగ్రూట్లో వస్తే ఎవరైతే నాకేంటి అన్నట్లు విధులు నిర్వహించాడు ఓ ట్రాఫిక్ ఎస్సై. రాంగ్రూట్లో వస్తుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కారును ట్రాఫిక్ ఎస్సై అడ్డుకున్నాడు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బాపూఘాట్లో మంత్రులు నివాళులు అర్పించారు. గాంధీకి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ శనివారం ఉదయం బాపూఘాట్లో పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన వెనుదిరిగి వెళ్తున్న సమయంలో.. ఐటీ మంత్రి కేటీఆర్ వాహనం రాంగ్రూట్లో బాపూఘాట్లోకి ఎంట్రీ ఇచ్చింది. గవర్నర్ కారుకు అడ్డు వస్తుందని భావించిన ఎస్సై.. వెంటనే కేటీఆర్ కారును పక్కకు ఆపాడు. గవర్నర్ కారు వెళ్లిన తర్వాత.. కేటీఆర్ కారును ముందుకు పోనిచ్చాడు.
For More News..