సెక్రటేరియెట్ పరిసరాల్లో చెత్త తొలగిస్తం: కేటీఆర్​

సెక్రటేరియెట్ పరిసరాల్లో చెత్త తొలగిస్తం: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: తాము అధికారంలోకి వచ్చిన తొలిరోజే సెక్రటేరియెట్ పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తన మాటలు గుర్తుపెట్టుకోవాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని ఆయన హెచ్చరించారు. ఈమేరకు మంగళవారం కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘అధికారంలోకి వచ్చిన తొలిరోజే సచివాలయం పరిసరాల్లోని చెత్త(రాజీవ్​గాంధీ విగ్రహాన్ని ఉద్దేశించి)ను తొలగిస్తాం.

నీ లాంటి ఢిల్లీ గులాం (సీఎం రేవంత్‌‌‌‌ను ఉద్దేశించి) తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోలేరు. చిన్న పిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ నైజం, వ్యక్తిత్వం, ఆయన పెంపకాన్ని సూచిస్తుంది. రేవంత్ ఈ మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను” అని- కేటీఆర్ విమర్శించారు. కాగా, రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మేఘాపై ఎందుకంత ఔదార్యం? మేఘా ఇంజినీరింగ్ కంపెనీ​పై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంత ఔదార్యం చూపిస్తున్నారని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.