అదానీతో కాంగ్రెస్, బీజేపీ బంధం దేశానికే అవమానం...కేటీఆర్​ ట్వీట్​

హైదరాబాద్, వెలుగు: అగ్రరాజ్యం అమెరికానే మోసం చేసిన ఘనుడు.. మన దేశ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు అదానీ అని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. అదానీపై అమెరికాలో కేసు నమోదైన వ్యవహారంపై ఆయన గురువారం ట్విట్టర్​లో స్పందించారు.

‘‘అదానీతో కాంగ్రెస్​, బీజేపీ బంధం దేశానికి అవమానం, అరిష్టం’’ అని కామెంట్​ చేశారు. రామన్నపేటలో సిమెంట్​ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపారో.. మూసీలో అదానీ వాటా ఎంతో చెప్పాలని డిమాండ్​ చేశారు. ఇలాంటి మోసగాడికి తెలంగాణలో పెట్టుబడులకు అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అంబుజా సిమెంట్​ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలన్నారు.