బీఆర్ఎస్ ఆఫీస్.. మరో జనతా గ్యారేజ్: కేటీఆర్​

బీఆర్ఎస్ ఆఫీస్..  మరో జనతా గ్యారేజ్: కేటీఆర్​
  • ప్రజలకు కష్టమొస్తే యాదికొస్తున్నది
  • రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు మరో పోరాటం చేయాలి
  • కేసీఆర్ అంటే పేరు కాదు.. తెలంగాణ పోరు అని వ్యాఖ్య
  • తెలంగాణ భవన్​లో దీక్షా దివస్ వేడుకలు
  • త్వరలోనే జమిలి ఎన్నికలు.. కేసీఆరే మళ్లీ సీఎం: ఎర్రబెల్లి

హైదరాబాద్/కరీంనగర్, వెలుగు:  దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణను రక్షించుకునేందుకు మరోసారి పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కష్టమొస్తే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భవన్ గుర్తుకొస్తున్నదని తెలిపారు. తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనతా గ్యారేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిందన్నారు. తెలంగాణ ఉద్యమంలోని అద్భుత ఘట్టాల్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఒక పతాక సన్నివేశమని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక కూడా ఉద్యమ యాది ఎందుకని ఊరుకుంటే.. అది పెద్ద పొరపాటు అవుతుందని అన్నారు. ప్రతి జాతికి, దేశానికి, ప్రాంతానికీ ఒక కథ ఉంటదని, తెలంగాణకూ అలాంటి కథే ఉందని తెలిపారు.

ఆ కథలో కేసీఆరే.. కథానాయకుడు అని అన్నారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్, కరీంనగర్ జిల్లా అలగనూరులో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘1969 ఉద్యమం తర్వాత తెలంగాణ వాదాన్ని బుద్ధి జీవులు, మేధావులే కాపాడారు. తర్వాత ఎవరైనా రాకపోతారా.. అని ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్ లాంటి వారు ఎదురు చూస్తున్న రోజుల్లో..  కేసీఆర్ వచ్చారు. కేసీఆర్ అంటే పేరు కాదు.. తెలంగాణ పోరు.. అని ఎమ్మెల్యే గంగుల చెప్పిన అక్షరాలు నిజం అయ్యాయి’’అని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ అస్థిత్వంపై దాడి జరుగుతున్నది

స్వాతంత్ర్యం సాధించడం ఎంత ముఖ్యమో.. దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని కేటీఆర్ అన్నారు. ‘‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అణిగిమణిగి ఉన్న శక్తులు.. ఇప్పుడు రెచ్చిపోతున్నాయి. సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహులు.. ఇప్పుడు తెలంగాణ అస్థిత్వంపై దాడి చేస్తున్నారు. సోనియా లేకుంటే తెలంగాణ అడుక్కుతినేదంటూ సీఎం రేవంత్ అహంకారంతో మాట్లాడుతున్నడు. సోనియా భిక్ష వల్లే తెలంగాణ వచ్చిందని ఉద్యమాన్ని కించపరుస్తున్నడు’’అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు.

ప్రభుత్వంపై కొట్లాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ‘‘టీఆర్ఎస్​కు జన్మనిచ్చిన పురిటిగడ్డ కరీంనగర్. 2006లో 2 లక్షల ఓట్ల మెజార్టీతో కేసీఆర్​ను ఎంపీగా గెలిపించిన్రు. కేసీఆర్ నాయకత్వం, విద్యార్థుల అమరత్వానికి కాంగ్రెస్ దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ దీక్ష.. తెలంగాణలో నిప్పు రగిల్చింది’’అని అన్నారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్.. హిమాలయాల అంతటి ఎత్తులో ఉన్నారన్నారు. ఆయన కాలి గోటికి కూడా రేవంత్ సరిపోరని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్​లో నిర్వహించిన దీక్షా దివస్ వేడుకలకు ఎమ్మెల్సీ కవితహాజరయ్యారు. 

రోడ్ నంబర్ 10లో భారీగా ట్రాఫిక్ జామ్

బీఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమంతో బసవతారకం హాస్పిటల్ నుంచి రోడ్ నంబర్ 10 వరకు దాదాపు 3 కిలో మీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటు కేబీఆర్ పార్క్ నుంచి బసవతారకం హాస్పిటల్ వరకు ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. 3 కి.మీ దూరాన్ని దాటేందుకు గంటన్నర టైం పట్టింది.

రోడ్​నంబర్​ 10లో ఓ అంబులెన్స్.. ట్రాఫిక్​లోనే చిక్కుకుపోగా, గంటన్నర తర్వాత దానికి లైన్ క్లియర్ అయింది. దీక్షా దివస్​కు కేసీఆర్ దూరంరాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ మాత్రం ఫామ్​హౌస్​కే పరిమితం అయ్యారు. కనీసం ఆయన నుంచి ప్రకటన అయినా వస్తుందని పార్టీ కేడర్ ఆశించినా.. అదీ రాలేదు.