ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి మహిళా కమిషన్ కేటీఆర్ కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో వివరణ ఇచ్చేందుకు మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు కేటీఆర్. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. తన వ్యాఖ్యలపై ఇప్పటికే క్షమాపణ చెప్పానని, ఇదే విషయం మహిళా కమిషన్ వద్ద కూడా చెప్పానని అన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.
కేటీఆర్ మహిళా కమిషన్ దగ్గరకు చేరుకున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. KTR వాహనాన్ని అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ నేతలు యత్నించారు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాంగ్రెస్ నేతలు. ఇదే సమయంలోనే అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ మహిళా నేతలు పోటీగా నినాదాలు చేయటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.