కాంగ్రెస్ కుట్రలే గోదావరి వరదల్లో కొట్టుకుపోయినయ్... కేటీఆర్

కాంగ్రెస్ కుట్రలే గోదావరి వరదల్లో కొట్టుకుపోయినయ్... కేటీఆర్
  • కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు

హైదరాబాద్, వెలుగు: గోదావరి వరదల్లో మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోలేదని, కాంగ్రెస్‌‌  కుట్రలే కొట్టుకుపోయాయని బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్  అన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలు అయ్యాయని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారని, ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు. ‘‘కాళేశ్వరంలో జరిగిన చిన్న విషయంపై తప్పుడు ప్రచారం చేశారు.

కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తయ్యాయి. ఇప్పుడు వరదలాగా నీళ్లు వస్తున్నా.. మేడిగడ్డ తట్టుకుంటున్నది. అదే కాళేశ్వరం గొప్పతనం. త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తాం. ప్రజలకు వాస్తవాలను వివరిస్తాం” అని కేటీఆర్  ట్విట్టర్ లో పేర్కొన్నారు. తెలంగాణ నేలకు ఇప్పటికీ, ఎప్పటికీ మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే ‘మేటి’గడ్డ’ అని ట్వీట్‌‌  చేశారు.