ఉప ఎన్నికలు వస్తాయో.. రావో కోర్టు చెప్తుంది.. మీరు కాదు: సీఎం వ్యాఖ్యలకు KTR కౌంటర్

ఉప ఎన్నికలు వస్తాయో.. రావో కోర్టు చెప్తుంది.. మీరు కాదు: సీఎం వ్యాఖ్యలకు KTR కౌంటర్

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులు, ఉప ఎన్నికలపై అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ కామెంట్స్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి ఆయన సీఎం అనే విషయం మర్చిపోతున్నారు.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ వేదికగా తీర్పు ఇవ్వాలని యత్నం చేస్తున్నారని విమర్శించారు.

న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాలపై వ్యాఖ్యలు చేయవద్దని నిబంధనలు చెబుతున్నాయి.. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆ రూల్స్‎కు వ్యతిరేకంగా మాట్లాడారు. తాను నిబంధనలకు అతీతమని.. సుప్రీంకోర్టు కంటే  ఎక్కువని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలీని న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇకనైనా రేవంత్ రెడ్డి పాలనపై వ్యవహరించి పాలనపై దృష్టి సారించాలని.. ఉప ఎన్నికలు రావాలా..? వద్దా..? సూచించారు.  

ALSO READ | Basanagouda Patil: బీజేపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యే సస్పెండ్

అంతకుముందు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిరోజు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఎలాంటి సంప్రదాయం ఉందో అదే సంప్రదాయాన్ని మేం ఫాలో అవుతున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇచ్చింది.

మేం ఎలాంటి పదవులు ఇవ్వడం లేదు. వాళ్ల అడుగుజాడల్లో మేం నడవడం లేదు. ప్రతి రోజు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఫిరాయింపుల అంశం కోర్టు పరిధిలో ఉంది. తెలంగాణలో ఎలాంటి ఉప ఎన్నికలు రావు. ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా దృష్టి ఉప ఎన్నికలపై లేదు.. అభివృద్దిపైనే ఉంది’’ అని అన్నారు.