పథకాలు రాని గ్రామాల్లో ప్రజా రణరంగమే : కేటీఆర్​

పథకాలు రాని గ్రామాల్లో ప్రజా రణరంగమే : కేటీఆర్​
  • మండలంలో ఒక గ్రామంలోనే పథకాలు అమలు చేస్తారా?: కేటీఆర్​

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు రాని గ్రామాల్లో ప్రజా రణరంగమే జరుగుతున్నదని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్ని రోజులు ప్రకటనలతో మభ్యపెట్టి, ఇప్పుడు మండలానికి ఒకే గ్రామంలో పథకాలను ప్రారంభించిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలకు తాము అండగా ఉంటామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో గానీ.. శనివారం వరకు గానీ మండలానికి ఒకే గ్రామంలో పథకాలను అమలు చేస్తామని చెప్పలేదన్నారు. 

ఇప్పుడేమో ఈ చేతగాని ప్రభుత్వం ప్రతి మండలంలో ఒక్కో గ్రామంలోనే పథకాలను ప్రారంభించి చేతులు దులుపుకుంటున్నదని విమర్శించారు. ఈ స్పీడుతో పథకాలను అమలు చేస్తే 60 ఏండ్లయినా గ్రామాల్లో అమలు చేయలేదన్నారు. ‘‘మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మేనిఫెస్టో పంచారా? మండలానికి ఒక గ్రామంలోనే కాంగ్రెస్ తన గ్యారంటీ కార్డులను పంచిందా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు అందరికీ అన్నీ అని చెప్పి.. ఇప్పుడు కొందరికే కొన్ని పేరిట మభ్యపెడుతున్నదని మండిపడ్డారు.