రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేటీఆర్ డ్రామాలు

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేటీఆర్ డ్రామాలు మొదలు పెట్టారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఏండ్లుగా కేంద్రానికి వంతపాడుతూ.. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం చూస్తుంటే అందరికీ నవ్వు వస్తుందని ఆమె అన్నారు. తెలంగాణకు కాకుండా మహారాష్ట్రకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేసినప్పుడు మాట్లాడకుండా.. ఇప్పుడు మాట్లాడటమేంటని ఆమె ప్రశ్నించారు.

‘8 ఏళ్ళుగా కేంద్రానికి వంతపాడుతూ 2014లోనే రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇంకా మంజూరు చేయట్లేదని,కొత్త లేన్లు వేస్తలేరని ఇప్పుడు డ్రామాలు మొదలెట్టారా చిన్నదొరా? 3 ఏండ్ల క్రితమే కేంద్రం తెలంగాణకు కాకుండా మహారాష్ట్రకు మంజూరు చేసినప్పుడు కాకుండా ఇప్పుడు నెత్తికొట్టుకుని నవ్వులపాలు కాకు’ అని షర్మిల ట్వీట్ చేశారు.

For More News..

ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ గార్డు దాడి