ఫార్ములా ఈ రేసు కేస్: ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణ

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. ఆరు గంటల తర్వాత ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో లోపలికి వెళ్లిన కేటీఆర్.. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఈడీ నుంచి పలు ప్రశ్నలను ఎదుర్కొన్నారు. విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా ఎలా చెల్లిస్తారని.. కేబినెట్ అనుమతి లేకుండా ఎలా ఆదేశాలు ఇస్తారని ప్రశ్నించారు ఈడీ అధికారులు. 

ఈ కేసులో 55 కోట్ల రూపాయలను డబ్బును.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా.. ప్రభుత్వ ఖాతా నుంచి ఎలా తరలించారంటూ ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్దంగా రూపాయిలను పౌండ్లలోకి మార్చి.. మరీ చెల్లించటంపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. HMDA ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధుల బదిలీ, నిధుల బదిలీలో ఫెమా ఉల్లంఘనలపై ప్రశ్నించింది ఈడీ.

ALSO READ | హరీష్ రావు కొంచెమన్నా సిగ్గుండాలి.. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఫైర్

ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. ఈ కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరుకావటం ఇదే ఫస్ట్ టైం. తొలి రోజు విచారణ ముగియటంతో.. ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు కేటీఆర్.