షాద్ నగర్,వెలుగు: మహిళలు ఆర్టీసీ బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మహిళను కించపరిచే విధంగా ఉన్నాయని షాద్ నగర్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు నాగమణి మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ షాద్ నగర్ టౌన్ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. కేటీఆర్‌పై కేంద్ర,రాష్ట్ర మహిళా కమిషన్ లు వెంటనే కేసులు నమోదు చేయాలని కోరారు.
కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో..
మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. శంషాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో తుమ్జాబాద్ బస్టాండ్ వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చెర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , కౌన్సిలర్లు శ్రీకాంత్, తాజ్ బాబా పాల్గొన్నారు.