- ఓడిపోతే ఎములాడకు రాను
- గెలిపిస్తే సెగ్మెంట్ ను దత్తత తీసుకుంటా
- ఇది ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య యుద్ధం
- ఈ ఎన్నికలు మా కోసం కాదు.. తెలంగాణ ఆగం కావద్దు
- యువత ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్
వేములవాడ: తాను వేములవాడను దత్తత తీసుకుంటున్నానని, లక్ష్మీనరసింహరావును గెలిపించకపోతే మళ్లీ వేములవాడకు రాను అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ వేములవాడలో జరిగిన యువత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ను రాజకీయంగా బొండిగె పిసుకాలని చూస్తున్నారని గుజరాత్, ఢిల్లీ వాళ్లు వచ్చినా ఏమీ చేయలేరని మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలంగాణకు అన్యాయం చేసింది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ యేనని.. ఇడ్లీ సాంబర్ గో బ్యాక్ ఉద్యమం సమయంలో 370 మందిన పొట్టన బెట్టుకున్నదని అన్నారు. 2001 నుంచి 2014వరకు ఉవ్వెత్తిన ఉద్యమం సాగితే తెలంగాణ వచ్చిందన్నారు. ‘కాంగ్రెస్ వాడు మేము తెలంగాణ ఇచ్చినం అని అంటున్నారు. ఈ ఎన్నికలు మా కోసం కాదు, తెలంగాణ ఆగం కావద్దు. ఇక్కడ పోరాటం నిలబడ్డ వ్యక్తి తో కాదు, కాంగ్రెస్ తో మాత్రమే పోటీ మాత్రమే.. ఇది ఇద్దరి వ్యక్తుల గొడవ కాదు.
ఒక్క కేసీఆర్ ఎంత ఉంటాడు. గింతంత ఉంటాడు, ఆయనను కొట్టడానికి ఎక్కడెక్కడో నుండి వస్తున్నారు. డికే శివ కుమార్ మన నెత్తి మీద పాలు పోసి పోయాడు, నాశనం చేసి పోయాడు, అందుకే ఇగ పిలవడం లేదు.తెలంగాణ భవిష్యత్ గల్లీలోనే కావాల’ అని కేటీఆర్ అన్నారు.