కేటీఆర్ షెడ్యూల్ ఖరారు

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రోడ్ షోలు, బహిరంగ సభలకు సంబంధించిన షెడ్యూల్ ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు కేటీఆర్ వివిధ నియోజకవర్గాల్లో విస్తృత స్థాయిలో పర్యటిస్తారని చెప్పారు.

ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్లగొండ, చేవెళ్ల, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విస్తృతంగా పర్యటిస్తారని చెప్పారు.

కేటీఆర్ పర్యటన వివరాలు :

  • ఈ నెల 27న  రాజన్న సిరిసిల్లలోని ముస్తాబాద్ మండలం
  • మార్చ్ 29న ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలతో పాటు కరీంనగర్ పట్టణంలో రోడ్‌ షో
  • మార్చ్ 30న నర్సంపేట, ములుగులో బహిరంగ సభలు, అదే రోజు తాండూరు, వికారాబాద్‌లో కేటీఆర్ పర్యటన
  • మార్చ్ 31న రాజన్న సిరిసిల్లలోని గంభీరావుపేట మండలం, వికారాబాద్ జిల్లాలోని పరిగి, చేవెళ్లలో పర్యటించనున్నారు కేటీఆర్.
  • ఏప్రిల్ 1వ తేదీన ఎల్బీనగర్, మహేశ్వరంలో రోడ్‌షోలు
  • ఏప్రిల్ 2న సిరిసిల్ల రూరల్, ఉప్పల్, మల్కాజ్‌గిరిలో పర్యటించనున్నారు.
  • ఏప్రిల్ 3వ తేదీన హుజుర్‌నగర్‌  బహిరంగ సభలో.. అదే రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్, మేడ్చల్‌లో రోడ్‌షోలు.
  • ఏప్రిల్ 4న ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభ, అంబర్‌పేట, ముషీరాబాద్‌లో రోడ్‌షోలు
  • ఏప్రిల్ 5న కోదాడలో బహిరంగసభ, సికింద్రాబాద్, సనత్‌నగర్‌లో రోడ్‌షోలు
  • ఏప్రిల్ 6న జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లిలో రోడ్‌షోలు
  • ఏప్రిల్ 7న మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్‌లో నిర్వహించే సభలతో పాటు రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసే రోడ్‌షోలు
  • ఏప్రిల్ 8న ఇల్లెందు, పినపాకలో బహిరంగ సభలు, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో రోడ్‌షోలు
  • ఏప్రిల్ 9న నల్లగొండలో కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొంటారు.