మంగళవారం వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించ‌నున్న కేటీఆర్, ఈట‌ల‌

వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని సోమ‌వారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను మంత్రుల‌ను, అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ , ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ మంగళవారం ఉదయం హెలి కాప్టర్లో వరంగల్ వెళ్ల‌నున్నారు. ఆ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కూడా వీరితో ప‌ర్య‌టిస్తారు. మంత్రుల బృందం నగరంలో పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించిన అనంత‌రం.. వరంగల్ ఎంజిఎంను సందర్శిస్తారని స‌మాచారం. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో వానలు, వరదలు, కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు. తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకుంటారు.

helicopter tour to warangal