ఫార్ములా ఈ రేసింగ్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ కేసుపై ప్రెస్ మీట్ లో నిర్వహించిన కేటీఆర్.. 2023 అక్టోబర్ 5, 11 తేదీలలో రూ.55 కోట్లు కట్టామని, అంతకు మించి అందులో దాచడానికి ఏమీ లేదని తెలిపారు. అవి కట్టకుంటే ఫార్ములా ఈ రేసింగ్ కాంట్రాక్ట్ రద్దయ్యేదని తెలిపారు. కేసులకు భయపడేది లేదని, న్యాయపరంగా ఎదుర్కొంటామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్లో ఏం లేదని ప్రభుత్వానికి కూడా తెలుసని, కావాలనే కేసు పెట్టిందని అన్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై లెటర్ కూడా రాసినట్లు తెలిపారు.
హైదరాబాద్ ను ఎలక్ట్రిక్ వాహనాల హబ్ గా మార్చాలనే లక్ష్యంతోనే ఈ రేసింగ్ నిర్వహించామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏం లేదని ప్రభుత్వానికి కూడా తెలుసని.. ఏదో కేసు పెట్టాలని పెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కు రేసింగ్ తేవాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయని అప్పట్లో వీలు కాలేదని అన్నారు. 2001లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని, గోపన్ పల్లిలో రేస్ ట్రాక్ కోసం భూసేకరణ కూడా చేశారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు అప్పట్లో అధికారంలోకి రాకపోవడంతో అది ఆగిపోయిందని అన్నారు.
ALSO READ | మొన్న బ్లాక్ షర్టులు .. నిన్న ఖాకీ అంగీలు.. ఇయ్యాల గ్రీన్ కండువాలు.. రోజుకో వేషంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ల మంది చూస్తారని, అంత ఆదరణ ఉన్న రేస్ ను హైదరాబాద్ కు తీసుకురావాలని ప్రయత్నం చేశామన్నారు. దీనితో బ్రాండింగ్.. పెట్టుబడులు.. కంపెనీలు వస్తాయని తెలిపారు. అందుకే చాలా దేశాలతో పోటీ పడి ఫార్ములా ఈ రేసింగ్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చినట్లు తెలిపారు.
తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ తీసుకురావాలి అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేసినట్లు తెలిపారు. ఆటోమోటివ్ రంగం, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలలో అభివృద్ధి చెందుతున్నందు వలన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని.. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలను ఆకర్శించాలని ఉద్దేశంతో ఈ రేసింగ్ కోసం పోటీ పడ్డామని తెలిపారు. వరుసగా నాలుగు సీజన్ లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అగ్రిమెంట్ చేసుకోవాలనుకున్నాం.
మహింద్ర, అమరరాజా, హ్యుందయ్ మొదలైన కంపెనీలు వచ్చాయని, అదే విధంగా కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి, సచిన్, ధవన్, వివిధ నటీనటులు వచ్చారని అన్నారు. ఫిబ్రవరీ 2023 లో రేస్ జరిగిందని.. దీని వలన హైదరాబాద్ ను ఎలక్ట్రిక్ వెహికిల్ విషయంలో ప్రపంచ పటంలో పెట్టండం కోసం నిర్వహించామని అన్నారు.
ఈ రేసింగ్ పై ప్రభుత్వం తరఫున పెట్టిన ఖర్చు మొత్తం HMDA పెట్టిందని.. దాదాపు రూ.30 నుంచి 35 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. స్పాన్సర్ లు పెట్టిన ఖర్చు.. దాదాపు రూ.110 కోట్లు తెలిపారు. ఈ రేస్ వలన హైదరాబాద్ కు 82 మిలియన్ డాలర్ల ఎకనామిక్ బెనిఫిట్ జరిగిందని తెలిపారు.
అయితే గ్రీన్ కో అనే సంస్థ ఈ రేస్ వలన హైదరాబాద్ కు లాభం జరిగిందని.. తమకు ఏం రాలేదని.. స్పా్న్సర్ చేయలేమని చెప్పడంతో వేరే ప్రమోటర్ కోసం ప్రయత్నించామని తెలిపారు. ఆ సమయంలో 2023లో అరవింద్ వచ్చి ప్రమోటర్ బ్యాక్ అయ్యారు ఏం చేద్దాం అని అడిగినపుడు వేరే ప్రమోటర్ ను వెతుకుదామని ధైర్యం ఇచ్చినట్లు తెలిపారు. వంద నుంచి 110 కోట్లు అయితే కడదాం అని చెప్పాం. తాను ఎలక్షన్ బిజీలో ఉండటం వలన అరవిద్ కుమార్ రెండు దఫాలు డబ్బులు చెల్లించారని చెప్పారు. అక్టోబర్ 5, 11 తేదీలలో రూ.55 కోట్లు కట్టామని.. అలా కట్టడం వలననే రేస్ కాంట్రాక్ట్ మనకు మిగిలిందని తెలిపారు. లేదంటే కాంట్రాక్ట్ రద్దయి ఉండేదని అన్నారు.