మోడీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది : కేటీఆర్

మోడీ వేడి తగ్గింది..కాంగ్రెస్ గాడి తప్పిందన్నారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు గెలిస్తే రాహుల్, మోడీకే లాభమన్నారు.అదే టీఆర్ఎస్ ను గెలిపిస్తే రాష్ట్రానికే లాభం అన్నారు. కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు బోథ్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు. 2014లో మోడీ మేనియాతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు కేటీఆర్. ఇప్పుడు సొంతంగా అధికారంలోకి వచ్చే సీన్ బీజేపీకి గానీ, కాంగ్రెస్ కు గానీ లేదన్నారు. మనం గెలిచే ప్రతి ఎంపీ.. ప్రధాని ఎన్నికలో కీలకం కాబోతుందన్నారు కేటీఆర్.