ఏసీపీ ఆఫీసు దగ్గర డీసీపీతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ ను అడ్డుకున్నారు డీసీపీ. రోడ్డుపై మీటింగ్ తో ప్రజలకు ఇబ్బంది కల్గించొద్దని చెప్పారు. పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోవాలని డీసీపీ సూచించారు. దీంతో మీడియాతో మాట్లాడితే ఎందుకంత భయమంటూ పోలీసులపై రుసరుసలాడారు కేటీఆర్.
నాలుగు ప్రశ్నలనే తిప్పితిప్పి అడిగారు
ఏసీబీ విచారణ సంతృప్తికరంగా సాగిందన్న కేటీఆర్.. రేవంత్ రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలనే ఏసీబీ తిప్పితిప్పి అడిగిందని సెటైర్ వేశారు. నిధుల మళ్లింపుపై ప్రధానంగా ప్రశ్నించారని తెలిపారు. ఏసీబీ వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. విచారణకు ఎన్ని సార్లు పిలిచినా..ఎప్పుడు పిలిచినా వస్తానన్నారు.
ఏడు గంటలు విచారణ
ఈ ఫార్ములా రేస్ కేసులో జనవరి 9న ఉదయం10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. కేటీఆర్ వెంట సీనియర్ లాయర్ రామచంద్రారావు ఉన్నారు. లైబ్రరీ రూం నుంచి విచారణను పరిశీలించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అరంగట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు. దాదాపు 7 గంటలు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించారు. విచారణలో కేటీఆర్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు అధికారులు.