మత పిచ్చి ఉన్నోడు..ఎంపీగా అవసరమా?: బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్

మత పిచ్చి ఉన్నోడు..ఎంపీగా అవసరమా?: బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్

కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మత పిచ్చి ఉన్నోడు..ఎంపీగా అవసరమా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీజేపీ పాలనలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదన్నారు. పదేళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేసిందని మండిపడ్డారు. మే11వ తేదీ శనివారం హుజురాబాద్ లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.

అయోధ్య గుడి కట్టినం ఓటయ్యాలని బీజేపీ నాయకులు అంటున్నారని.. మరి, కేసీఆర్ కూడా యాదాద్రి గుడి, ఆధునిక గుడులు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని కేటీఆర్ చెప్పారు. హ్యాండ్లూమ్, పవర్ లూం బోర్డులను రద్దు చేశారని విమర్శించారు. రౌశిక్ రెడ్డి  కోడిగిత్త లాగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి చెమటలు పెట్టిస్తున్నాడని..   బండి ఏం పీకాడు.. అమిత్ షా చెప్పులు మోసుడు తప్పా అని దుయ్యబట్టారు. 5ఏళ్లు గాలి తిరుగులు తిరిగినోడు, మతం పేరు మీద మ్యాజిక్ లు చేసేటోళ్లు ఎంపీగా అవసరమా? అని ప్రశ్నించారు.  ఎన్నికల్లో10 నుంచి 12 ఎంపీలను గెలిపిస్తే.. 6 నెలల్లో రాష్ట్ర రాజకీయాలను శాసిస్తామని కేటీఆర్ అన్నారు.