చర్చ పెట్టకుండా పారిపోయిండ్రు.. అప్పులపై తప్పుదోవ పట్టిస్తుండ్రు: కేటీఆర్

చర్చ పెట్టకుండా పారిపోయిండ్రు.. అప్పులపై తప్పుదోవ పట్టిస్తుండ్రు: కేటీఆర్
  • భూములివ్వకపోతే జైల్లో పెడతారా?
  • లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాల్సిందే

హైదరాబాద్‌: లగచర్లలో భూములు ఇవ్వకపోతే రైతులను  జైల్లో పెడతారా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చ పెట్టకుండా రేవంత్ రెడ్డి పారిపోయారని ఫైర్​అయ్యారు. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందనిమాజీ  ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. 

‘మా భూమి మేము ఇవ్వం’ అన్న పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారు. జైల్లో రైతులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. రైతుల బాధలు సమస్యలు కావా? అక్కడి రైతులు ఇబ్బంది పడుతుంటే టూరిజంపై చర్చ అవసరమా? సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.. ఒక్కపైసా తేలేదు. ఎమ్మెల్యే ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. అందుకే సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చినం. గతంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి నోటీసులిస్తే అప్పటి స్పీకర్‌ చర్చకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు ఆర్బీఐ నివేదికలో తేటతెల్లమైంది’ అని కేటీఆర్​తెలిపారు.

  • రేపు  అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు

లగచర్ల రైతులపై కేసులు పెట్టి..  రైతులకు బేడీలు వేయటాన్ని బీఆర్ఎస్ ఖండిస్తోంది. ఈఘటనకు నిరసనగా రేపు ఉదయం 11 గంటలకు అన్ని నియోజకవర్గాల్లో  అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించాలని పార్టీ కేడర్ కు పిలుపునిచ్చింది. లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​చేసింది.